దుల్హాన్‌ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి

ఏపీ అసెంబ్లీ: దుల్హాన్‌ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఎమ్మెల్యే అంజద్‌బాషా డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో దుల్హాన్‌ పథకంపై ప్రసంగించారు.
దుల్హాన్‌ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 2015–2016లో 20020 దరఖాస్తులు వచ్చాయి. వాటినిలో 14 వేల దరఖాస్తులు పరిష్కరించామని మంత్రి చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఏడు వేల దరఖాస్తులు ఎప్పుడు పూర్తి చేస్తారని ఎమ్మెల్యే నిలదీశారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో 331గా టార్గెట్‌  ఇచ్చారు, ఈ ఏడాది 1600 లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 60 శాతం కూడా పరిష్కారం కావడం లేదు. పెండింగ్‌ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
Back to Top