ఉక్కు..ఆంధ్రుల హక్కు
వైయస్‌ఆర్‌ జిల్లా: కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ సాధనకు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీలు కలిసి ఏపీకి ద్రోహం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా హామీలు నెరవేర్చక పోగా లాలూచీ పడ్డారని మండిపడ్డారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా సాధనకు పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం ఏ అస్త్రం లేక..ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా, ఉక్కు అంటూ కపట నాటకాలాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ దీక్ష డ్రామా అని అభివర్ణించారు. 
 
Back to Top