పట్టువదలని విక్రమార్కుడిలా వైయస్‌ జగన్‌ పోరాటం

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పట్టువదలని విక్రమార్కుడిలా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్ప ప్రజలంతా హోదా కోరుకుంటున్నారన్నారు. ఢిల్లీ ఏపీ భవన్‌లో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల దీక్షా శిబిరం వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హోదా బతికి ఉండటానికి కారణం వైయస్‌ జగన్‌ ఒక్కరేనన్నారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా పోరాటం చేస్తూ ప్రజలను, యువతను చైతన్య వంతులను చేస్తూ వస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పడానికి సీఎం చంద్రబాబు సిగ్గులేదన్నారు. హోదా విషయంలో అన్ని పోరాటాలు చేసి పార్లమెంట్‌ చివరి రోజు వైయస్‌ జగన్‌ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని మాట నిలబెట్టుకున్నారన్నారు. హోదా కోసం ఎంపీలంతా ఏపీభవన్‌లో నిరాహార దీక్షకు సైతం కూర్చుంటున్నారన్నారు. ఎంపీల దీక్షకు మద్దతుగా ఆంధ్రరాష్ట్రమంతా రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు నడుకుంటూ హోదా సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. 
 
Back to Top