ప్ర‌శ్నించే పార్టీ అధినేత ఎక్క‌డ..?

కాకినాడ: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాపుల‌ను బీసీలుగా చేస్తాన‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి మోసం చేస్తుంటే ప్ర‌శ్నిస్తాన‌ని పార్టీ పెట్టిన వ్య‌క్తి ఎక్క‌డున్నాడంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిల‌దీశారు. వైయ‌స్ఆర్ సీపీ తూర్పు గోదావ‌రి జిల్లా ప్లీన‌రీలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... చేనేత‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చెప్పుకునే పెద్ద మ‌నిషి జీఎస్టీ భారం గురించి ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌శ్నిస్తాన‌ని పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగో.. లేక లబ్బర్‌ సింగో ఆయనే తేల్చుకోవాలి. ప్రజల శ్రేయస్సే ముఖ్యమనుకుంటే ప్రభుత్వాలను నిలదీయాలన్నారు. గిరిజనుల అనారోగ్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌.. టీడీపీ ఎమ్మెల్యేనో, బీజేపీ ఎమ్మెల్యేనో అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కొండలు ఎక్కుతారు కానీ గిరిజనులకు నీళ్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. మంత్రి యనమల రామకృష్ణుడిని విషంపూసిన కత్తిగా వర్ణించారు. ప్రజలు తిరస్క‌రించినా దొడ్డిదారిన మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.

Back to Top