ప్రతి గుండె వైయస్‌ఆర్‌ను తలచుకుంటోంది

వైయస్‌ఆర్‌ పేరు కాదు.. బ్రాండ్‌
వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
విజయవాడ: తెలుగు రాష్ట్రాన్ని ప్రతీ గుండె ఇప్పటికీ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని తలచుకుంటోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైయస్‌ఆర్‌ పేరు కాదు.. బ్రాండ్‌ అని కొనియాడారు. విలువలు, విశ్వసనీయ, నమ్మకానికి మారుపేరు మహానేత అని గుర్తు చేశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. తొమ్మిదేళ్లుగా ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వైయస్‌ఆర్‌లా సంక్షేమాన్ని అందించగలిగే, వైయస్‌ఆర్‌ వారసత్వాన్ని నిలబెట్టగలిగే వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని రోజా అన్నారు. 

చంద్రబాబు నాయుడుది దోచుకో.. దాచుకో సిద్ధాంతమన్నారు. చంద్రబాబు అసమర్ధత సీఎం అని, విదేశీ పర్యటనల పేరుతో దోచుకున్న డబ్బుని దాచి వస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన మంత్రులు  దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యనమల రామకృష్ణుడు నువ్వు కూడా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తావా? నాలుగేళ్లు బీజేపీతో ఉండి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెట్టి.. ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.  అఫిడవిట్‌ విషయంలో సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  
 
Back to Top