<br/>చిత్తూరు: గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరింది. ఈ నెల 28న నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమై పాదయాత్ర తిరుమల వరకు సాగనుంది. డిసెంబరు 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూడాలని రోజా ప్రత్యేక పూజలు చేయనున్నారు. రోజా చేపట్టిన పాదయాత్రకు నియోజకవర్గంలో విశేష స్పందన వస్తోంది. పలువులు ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు.