ప్ర‌త్యేక హోదాకు చంద్ర‌బాబే అడ్డు

* హోదాపై బాబువి అర్థం ప‌ర్థం లేని మాట‌లు
* త‌న స్వార్థ రాజ‌కీయాల‌కోసం హోదాను తాక‌ట్టుపెట్టారు.
* ఎవ‌రికీ ఇవ్వ‌ని ప్యాకేజీ ఇచ్చార‌ని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసింది మ‌రిచిపోయారా?
* అవినీతి ఆస్తులు కూడాక‌ట్టుకున్న బాబును మోడీ ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు?
* ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌ను బాబును రాజీ చేశామ‌ని మోడీ చెప్పింది గుర్తులేదా?
* వేయికాళ్ల మండ‌పాన్ని పునఃనిర్మించాల‌ని ఈవోకు విన‌తిప‌త్రం.

తిరుమ‌ల‌: ప‌్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు నాయుడు యూట‌ర్న్ తీసుకున్నార‌ని రాష్ట్రం మొత్తం కోడైకూస్తోంద‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హోదాపై చంద్ర‌బాబు నాయుడు అర్థం ప‌ర్థం లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేయికాళ్ల మండ‌పాన్నిటీటీడీ పునః  నిర్మించాల‌ని ఈవోకు విన‌తిప‌త్రం ఇచ్చిన అనంత‌రం రోజా మాట్లాడారు. టీటీడీని ఆర్టీఐ యాక్ట్  కింద తీసుకురావాల‌న్నారు. అనంత‌రం చంద్ర‌బాబు వ్య‌వ‌హారంపై నిప్పులు చెరిగారు. ప్ర‌త్యేక హోదాపై తాను యూట‌ర్న్ తీసుకోల‌ద‌ని అన‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. ఊస‌ర‌వెల్లి సైతం సిగ్గుప‌డేలా చంద్ర‌బాబు మాట‌లు మారుస్తాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. 

ప్యాకేజీ బాగుంద‌ని అసెంబ్లీలో తీర్మానం చేయించ‌లేదా?
ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌ని.. ప్యాకేజీ ముద్ద‌ని అన్న నాయ‌కుడు చంద్ర‌బాబు అన్నారు.  దేశంలో ఎవ‌రికీ ఇవ్వ‌ని ప్యాకేజీ మ‌న రాష్ట్రానికి కేంద్రం ప్ర‌భుత్వం ఇచ్చింద‌ని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయించిన వ్య‌క్తి  చంద్ర‌బాబు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం, త‌న కాంట్రాక్టుల కోసం ప్ర‌త్యేక హోదాను కేంద్రం వ‌ద్ద తాక‌ట్టుపెట్టి ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌న్నారు. 

చంద్ర‌బాబు మోడీని ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు?
చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష‌ల కోట్లు అవినీతి సొమ్మును కూడ‌బెట్టుకున్న చంద్ర‌బాబును ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎందుకు అరెస్ట్ చేయించ‌లేద‌ని ఎమ్మెల్యే రోజా ప్ర‌శ్నించారు. టీడీపీ..బీజేపీ డ్రామాలు ప్ర‌జ‌లంద‌రూ గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. రూ.250 కోట్ల‌తో చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ర‌హ‌స్యంగా ఇల్లు క‌ట్టుకున్నార‌ని, ఆ ఇంట్లోకి ఒక టీడీపీ చీమ‌ను కూడా ఆహ్వానించ‌లేద‌న్నారు. ఆహ్వానిస్తే త‌న అవినీతి బండారం బ‌య‌ట ప‌డుతుంద‌ని ఆయ‌న భ‌య‌మ‌న్నారు. ల‌క్ష‌ల కోట్లు అవినీతి సొమ్మును సంపాదించారు కాబ‌ట్టే దేశంలోనే అత్యంత ధ‌నిక ముఖ్య‌మంత్రిగా స్థానం సంపాదించుకున్నార‌న్నారు. 

ఓటుకు కోట్లు కేసులో రాజీ చేశాన‌ని మోడీనే చెప్పారు
చంద్ర‌బాబు నాయుడు తాను సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వీడియోల‌ను ప్ర‌పంచం మొత్తం చూసిందని రోజా అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు జైలుకు పోవ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నార‌ని, కానీ ఓటుకు కోట్లు వ్య‌వ‌హారంలో కేసీఆర్‌ను, చంద్ర‌బాబును రాజీ చేశాన‌ని సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి మోడీనే చెప్పార‌న్నారు. 

మా నాయ‌కుడి వ‌ల్లే హోదా సాధ్యం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా సాధించ‌డం చంద్ర‌బాబు వ‌ల్ల కాద‌ని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్ర‌త్యేక హోదా కోసం నాలుగున్న‌రేళ్లుగా మేము పోరాటం చేస్తున్నామ‌ని, మా పార్టీ ఎంపీలు సైతం హోదా కోసం రాజీనామాలు చేసి పోరాటం చేస్తున్నార‌న్నారు.  ఏపీకి హోదా మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ వ‌ల్లే సాధ్య‌మ‌ని రోజా పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top