రోజాపై దాడికి యత్నం

 
తిరుపతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరికి దిగారు. పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను ప్రోటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆమెపై దాడికి యత్నించారు.  వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి ఆమర్నాథ్‌ రెడ్డి సమక్షంలోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా టీడీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డుతూ అరాచ‌కాలు స్ప‌ష్టిస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top