హోదా కోసం మా ఎంపీలు రాజీనామాలకు సిద్ధం

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంట్‌ సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. చంద్రబాబు డ్రామాలు ఆపాలని, ఢిల్లీలో ఫొటోలకు ఫోజులివ్వడం కాదని, టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ఆమరణదీక్షలో పాల్గొనాలన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కొంచెమైనా సరిదిద్దడానికి ప్రయత్నం చేయనందుకు, ప్రత్యేక హోదాను నిరాకరించినందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు పదవులకు రాజీనామాలు సమర్పించేందుకు సిద్ధ‌మ‌య్యార‌న్నారు. ఆ త‌రువాత‌ ఆంధ్రప్రదేశ్‌ భవనం ఎదుట ఆమరణ దీక్షను చేపట్ట బోతున్నార‌ని చెప్పారు. పార్లమెంటు చరిత్రలోనే కనీవినీ ఎరుగుని రీతిలో 14 సార్లు ఎన్డీయే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఏదో కారణంతో వాటిని పక్కన పెడుతూనే ఉన్నార‌ని మండిప‌డ్డారు.
 
Back to Top