వైయస్‌ జగన్‌తోనే పేదల జీవితాల్లో వెలుగులు

చిత్తూరు: చంద్రబాబు పాలనలో చీకట్లో ఉన్నారని, పేదల జీవితాల్లో వెలుగులు నిండాలంటే వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కల్లూరు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రోజా రావాలి జగన్‌..కావాలి జగన్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటా ఆమె పర్యటించి వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తూ అధికార దుర్వినియోగంతో దోచుకుంటున్నారన్నారు.  రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, తన కొడుకు లోకేష్‌ ఆస్తులు మాత్రం 25 రెట్లు పెంచేలా ప్రోత్సహించారని చెప్పారు.  ఎవరి గురించి పట్టించుకోకుండా రాష్ట్రాన్ని దోచుకుంటు చెడ్డపేరు తెస్తున్నారన్నారు. పేద ప్రజల కష్టాలను దూరం చేసేందుకు నవరత్నాల ద్వారా పుట్టిన బిడ్డ మొదలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు వైయస్‌ జగన్‌ వస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ మాట తప్పరని, ఆయనకు ఒక్క అవకాశం ఇ వ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబం కూడా చంద్రబాబు పాలనలో ఎలా నష్టపోతున్నారో అడుగడుగునా కనిపిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని, రాజన్న రాజ్యం మళ్లీ తెచ్చుకుందామని రోజా పిలుపునిచ్చారు. 
 
Back to Top