పేదలు ఇప్పుడు గుర్తుకొచ్చారా బాబూ?


తిరుపతి: పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు మరోసారి డ్రామాలాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతిలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లు గుర్తు రాని పేదలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ఆమె ప్రశ్నించారు. ఆరు నెలల్లో 19 లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారని ఆమె నిలదీశారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అన్నారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో రూ. వేల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు, మంత్రి నారాయణ యత్నించారని ఆరోపించారు. 
 
Back to Top