చంద్రబాబు రైతు ద్రోహి


చిత్తూరు: రైతులపై చంద్రబాబుకు ఉన్నది దొంగ ప్రేమ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు రైతు ద్రోహి అని ఆమె విమర్శించారు. మామిడికాయ రైతులు బుధవారం కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై మామిడికాయలు వేసి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు రోజా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలోనే రైతులను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న టమాట రైతులు, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డునపడ్డారని తెలిపారు. ఇది చంద్రబాబు సర్కార్‌కు సిగ్గు చేటు  అన్నారు. గతంలో రైతులను విస్మరించిన కారణంగా చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారని, ఇప్పుడు అదే గతి పడుతుందని హెచ్చరించారు.
 

తాజా ఫోటోలు

Back to Top