వంగి వంగి దండాలు పెట్టే పోటీల్లో బాబుకే ఫ‌స్ట్ ఫ్రైజ్‌

- మ‌రోసారి బీజేపీ, టీడీపీ లాలూచి బాగోతం బ‌య‌ట‌ప‌డింది
- ప్ర‌త్యేక హోదాపై నోరు మెద‌ప‌ని చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించిన‌ట్లు?
తిరుప‌తి: ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఒలింపిక్స్‌లో వంగి వంగి దండాలు పెట్టే పోటీలు నిర్వ‌హిస్తే చంద్ర‌బాబుకు ఫ‌స్ట్ ప్రైజ్ వ‌స్తుంద‌ని ఆమె ఎద్దేవా చేశారు. సోమ‌వారం తిరుప‌తిలో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనతో భూగోళం బద్దలవుబోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసిందని, చివరికీ ఏం జరిగిందో అందరూ చూశారని ఆమె వ్యాఖ్యానించారు. ఇకనైనా చంద్రబాబు మోసపూరిత మాటలు, మోసపూరిత పర్యటనలు మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ హస్తినలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు సిగ్గుచేటు అన్నారు.  రాష్ట్ర విభజన కాంగ్రెస్‌, బీజేపీలు కలిసే చేశాయి. నాలుగేళ్లు ఎన్డీయేలో కలసి ఉన్న చంద్రబాబు ఇప్పుడు విడిపోయామంటున్నారు. నీతి అయోగ్ స‌మావేశంలో టీడీపీ, బీజేపీ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదాపై ఢిల్లీలో నోరు మెద‌ప‌ని చంద్ర‌బాబు ఏం సాధించిన‌ట్లు అని ఆమె నిల‌దీశారు. మోదీ వ‌ద్ద వంగి వంగి దండాలు పెట్టేందుకే ఢిల్లీ వెళ్లారా అని ఆమె ప్ర‌శ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీతోనే ప్ర‌త్యేక హోదా సాధ్య‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. 
Back to Top