వైయస్‌ జగన్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
– చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ
తిరుపతి: రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు.  నగరిలో చిరు వ్యాపారులకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా అండగా నిలబడ్డారు. సొంత నిధులతో వ్యాపారులకు తోపుడు బంగ్లు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని విమర్శించారు. 
 
Back to Top