బాబు పాపాలు పండే టైం వచ్చింది

ఒక్క కేసు విచారణకు వచ్చినా జీవితాంతం జైలే
చంద్రబాబు హోదా పోరాటం అంటే జనం నవ్వుతున్నారు
కుట్ర రాజకీయాలకు పేటెంట్‌ రైట్స్‌ బాబువే
యనమలకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు
రాష్ట్ర ప్రయోజనాలకు ప్రతిపక్షనేత అడ్డు అనేందుకు సిగ్గులేదా
ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటిపోరాటమైనా చేసే ధీరుడు వైయస్‌ జగన్‌
ఎ్రరన్నాయుడు, శంకర్‌రావు, కాంగ్రెస్‌తో కలిసి అక్రమ కేసులు పెట్టించారు
వైయస్‌ జగన్‌ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యం విచారణ ఎదుర్కొంటున్నారు
ఈ సారి టీడీపీ అడ్రస్‌ లేకుండా పోతుంది
విశాఖపట్నం: నాలుగేళ్లుగా ఆంధ్రరాష్ట్రాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు పాపాలు పండే టైం వచ్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. లోకేష్‌ ఓట్ల మార్పిడి కుంభకోణం, చంద్రబాబు ఓటుకు కోట్ల కేసు, రాజధాని భూకుంభకోణం ఏ కేసు విచారణకు వచ్చినా చంద్రబాబు, ఆయన కొడుకు, క్యాబినెట్‌ జీవితాంతం జైల్లో ఉంటారన్నారు. ప్రత్యేక హోదాను నాలుగేళ్లుగా ఉరేసి.. సమాధి కట్టిన చంద్రబాబు హోదా కోసం పోరాటాలు చేస్తున్నారంటే ప్రజలంతా నవ్వుతున్నారన్నారు. విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన వంచన వ్యతిరేక దీక్షలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. తిరుపతిలో నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం అని చెప్పి చంద్రబాబు కొత్త డ్రామాకి తెరలేపారన్నారు. 2014 ఏప్రిల్‌ 30వ తేదీ వెంకన్న సాక్షిగా బీజేపీ, టీడీపీ, ప్రజలను వంచించి నమకద్రోహం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 15 సంవత్సరాలు హోదా సాధిస్తానన్న చెప్పిన చంద్రబాబు నాలుగేళ్లు మొద్దు నిద్రపోయి.. ఇవాళ పోరాటం చేస్తున్నానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేంద్రంతో జతకట్టి రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసిన చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నక్కజిత్తుల డ్రామాలు ఆడుతున్నాడన్నారు. 

కుట్ర రాజకీయాలకు పేటెంట్‌ రైట్స్‌ చంద్రబాబుకే ఉన్నాయని రోజా ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని, పార్టీని, ట్రస్టు భవన్‌ లాక్కొని ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురి చేసి వేధించి చంపిన కుట్ర దారుడు చంద్రబాబని విమర్శించారు. అసెంబ్లీ సీట్లు పెంచితే చాలు ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన పర్వాలేదని కుట్ర రాజకీయాలు చేశాడన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొలేక చీకట్లో చిదంబరంలో కాళ్లు పట్టుకొని.. సోనియాకు వంగివంగి దండాలు పెట్టి చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టించారన్నారు. కాంగ్రెస్‌తో కుట్ర రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశాడు. రాష్ట్రాన్ని విడగొట్టి.. హోదా రాకుండా చేసిన ద్రోహి చంద్రబాబు నాయుడన్నారు.

ప్రత్యేక హోదాకు ఊపిరిపోసి బత్రికించిన దమ్మున్న నాయకుడు వైయస్‌ జగన్‌ అని రోజా అన్నారు. యనమల రామకృష్ణుడికి వయస్సు పెరిగింది కానీ.. బు్రర, బుద్ధి పెరగలేదని అర్థం అవుతుందన్నారు.  వైయస్‌ జగన్‌ రాజధానికి, పోలవరం అడ్డంకి అని మాట్లాడుతుడని, ఆర్థిక మంత్రిగా ఉండి.. లోటు పూడ్చలేని వ్యక్తివి నువ్వు మంత్రివా..అని ప్రశ్నించారు. జీఎస్టీ కౌన్సిల్‌లో మెంబర్‌గా ఉండి.. నష్టాల్లో ఉన్న ఏపీకి జీఎస్టీ మినహాయింపు తీసుకురాలేని చేతగాని దద్దమ్మకు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైయస్‌ జగన్‌ తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వెళ్తున్నారని, చంద్రబాబు, లోకేష్, మంత్రులు తప్పు చేశారు కాబట్టి బీజేపీతో కుమ్మకయ్యారన్నారు. పోలవరం వైయస్‌ఆర్‌ కల, పోలవరం ఎక్కడుందో కూడా తెలియని వ్యక్తి చంద్రబాబు. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును కమీషన్ల కోసం కక్కుర్తి పడి తీసుకువచ్చి వైయస్‌ జగన్‌ అడ్డుకుంటున్నాడని చెప్పడానికి సిగ్గులేదా.. అని నిలదీశారు. 

మోడీ రాజధాని శంకుస్థాపనకు చెంబు మట్టి, నీళ్లు ఇస్తుంటే ప్రతిపక్షనేత నిలదీయలేదని మంత్రి దేవినేని ఉమ మాట్లాడడం సిగ్గుచేటని రోజా అన్నారు. మోడీ ఇచ్చిన చెంబులు కళ్లకు అద్దుకున్న దద్దమ్మ చంద్రబాబు.. అది చూస్తూ నిలదీయలేని దద్దమ్మలు మంత్రులు.. ఇంట్లో పేరంటంలా శంకుస్థాపన చేసుకొని ప్రతిపక్ష నేత నిలదీయలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడీఆర్‌ ఇచ్చిన రిపోర్టులో మహిళలపై అట్రాసిటీ చేసే 5 మంది వ్యక్తుల్లో అందరూ టీడీపీ నేతలేనని, అందులో దేవినేని ఉమకు కూడా స్థానం ఉందన్నారు. మహిళలపై దాడులు చేసి బతుకుతున్న వ్యక్తి  రాజీనామాలు చేయకుండా మంత్రిగా కొనసాగడం సిగ్గుచేటన్నారు. ఎ్రరన్నాయుడు, శంకర్‌రావు, కాంగ్రెస్‌తో జత కలిసి రాజకీయ కక్షసాధింపుగా కేసులు వేసి ఈ రోజు వైయస్‌ జగన్‌ తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారని, టీడీపీ పాపం పండే టైం వచ్చిందన్నారు. ఎంతటి వారితోనైనా పోరాటానికి సిద్ధంగా ఉన్న ధీరుడు వైయస్‌ జగన్‌ అని, ఆనాడు సోనియా గాంధీతోనైనా.. ఇప్పుడు మోడీతోనైనా రాష్ట్ర ప్రజలకు ఢీకొట్టాడన్నారు. 18 మంది ఎంపీలు ఉండి మీరు చేయలేని ధైర్యాన్ని పంచ పాండవుల్లాంటి ఎంపీలతో రాజీనామాలు చేయించి, ఢిల్లీలో ఆమరణదీక్ష చేయించి దేశ వ్యాప్తంగా మోడీ చేసిన అన్యాయంపై చర్చలేపారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌పై బురదజల్లే విధంగా లాలూచీ అనే పదం వాడితే.. గతంలో ఏ విధంగా టీడీపీ మట్టుపెట్టుకుపోయిందో అందరికీ తెలుసు.. ఈ సారి ప్రజలు అడ్రస్‌ లేకుండా చేస్తారని హెచ్చరించారు. 
 
Back to Top