మాది పోరాటాల పార్టీ– వైయస్‌ఆర్‌సీపీవి ఆమరణ దీక్షలు..టీడీపీవి ఆహార దీక్షలు
– మా ఎంపీల దీక్షలను విమర్శించే అర్హత టీడీపీకి లేదు
– కొవ్వుకు బ్రాండ్‌ అంబాసిడర్లు  టీడీపీ ఎంపీలు, మంత్రులు
– బాబు 30 సార్లు ఢిల్లీ వెళ్లి హోదా గురించి ఎన్నిసార్లు అడిగారు?
– విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ లోకేష్‌కు సూట్‌కేసులు ఇస్తేనే పనులు
– అమరావతిని స్కాం కేపిటల్‌గా మార్చారు
 – విధి లేని పరిస్థితుల్లో నామినేటెడ్‌ పదవుల పందేరం
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది పోరాటాల పార్టీ అని ఎమ్మెల్యే రోజా అభివర్ణించారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఎంపీల దీక్షలపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షే మాకు ముఖ్యమని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పోరాటం చేసిన తీరును చూసి తెలుగు ప్రజలు గర్వపడుతున్నారన్నారు. టీడీపీ నేతలు ప్రత్యేక హోదాకు సమాది కట్టి కుంభకర్ణుడిలా నాలుగేళ్లు నిద్రపోయి  ఈ రోజు తాను దానకర్ణుడిని అన్నట్లుగా చంద్రబాబు తన అనుకూలమీడియాతో ప్రచారం చేయించుకోవడం సిగ్గుచేటు అన్నారు. 2016లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి తలొంచి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసిన తెలుగు ద్రోహి చంద్రబాబే అన్నారు. నాలుగేళ్లలో ఏ రోజు కూడా చంద్రబాబు ప్రజల పక్షాన చిత్తశుద్దితో పోరాటం చేయలేదన్నారు. అధికారం కోసం పొత్తులు పెట్టుకోవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడమే చంద్రబాబు చేసిన ఘనకార్యమన్నారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించకపోగా, రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయించడం లేదు అని అడగటం దుర్మార్గమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా రెండు నెలల పదవీ కాలం ఉన్న హరికృష్ణ చేయించి , నీ బినామీ ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేకపోయావని ఆమె ప్రశ్నించారు. బీజేపీతో లాలూచిపడి విధిలేని పరిస్థితిలో ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారన్నారు. కేంద్ర మంత్రులైన అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరిలు ఎన్‌డీఏను పొగడుతుంటే మీ చిత్తశుద్ది ఏంటో తెలుస్తుందన్నారు. మోడీ కాళ్లు కడిగి చంద్రబాబు నెత్తిన చల్లుకున్నారన్నారు. అలాంటి మీరా మా పార్టీ గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. మాది పోరాటాల పార్టీ అని రోజా అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను అధికార పార్టీలు తుంగలో తొక్కుతుంటే వాటిని కాపాడేందుకు వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. మా ఎంపీలు దేశం మొత్తం చర్చించుకునే విధంగా పోరాటం చేశారన్నారు. కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత వైయస్‌ఆర్‌సీపీది అన్నారు. మేం కేంద్రంతో కుమ్మక్కు అయితే ఎందుకు నాలుగేళ్లుగా హోదా కోసం పోరాటం చేస్తామని ఆమె నిలదీశారు. హోదా ఉద్యమాన్ని చంద్రబాబు ఇనుప పాదాలతో తొక్కించారన్నారు. ఈ రోజు రైల్‌రోకో చేస్తుంటే పోలీసులతో దౌర్జన్యం చేయించారన్నారు. పార్లమెంట్‌లో పీకలదాకా తిని స్పీకర్‌ చాంబర్‌ వద్ద ధర్నా చేశారని, పక్కనే ఉన్న పీఎం చాంబర్‌ వైపు కన్నెత్తి చూసే ధైర్యం టీడీపీ ఎంపీలకు లేదన్నారు. నాలుగేళ్లుగా తిని బలిసి ఆహార దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పందికొక్కుల్లా ఉన్న టీడీపీ ఎంపీలకు మెడిటేషన్‌ అవసరమన్నారు. కొవ్వుకు బ్రాండ్‌ అంబాసిడర్లు  టీడీపీ ఎంపీలు, మంత్రులే అన్నారు. ప్రజల కోసం దీక్షచేస్తున్న ఎంపీలకు సంఘీభావం తెలపని టీడీపీ నేతలు చేతకాని వారు అన్నారు. హోదా రాకపోతే రాష్ట్రం వెనకబడి పోతుందని ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబుకు గుర్తు రాని స్కీమ్‌లు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని చంద్రన్న పెళ్లి కానుక అంటున్నారన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు నాలుగేళ్లుగా ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అవినీతిమయంగా రాష్ట్రాన్ని మార్చారని, లా అండ్‌ ఆర్డర్‌ లేకుండా పోయిందన్నారు. మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. వీటన్నింటిని డైవర్ట్‌ చేసేందుకు యూటర్న్‌ అంకులు హోదా పోరాటం అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. అంతా మోడీ ఇచ్చారని చెప్పిన చంద్రబాబు ఆ డబ్బంతా ఎక్కడ దాచావని ఆమె ప్రశ్నించారు. అంతా ఇచ్చిన కేంద్రంపై ఎందుకు బురద జల్లుతున్నారని, మీరు చేసిన తప్పులకు మాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. కేంద్రాన్ని ఎన్నిసార్లు హోదా విషయంలో అడిగారని ధ్వజమెత్తారు. ప్రజలను నాలుగేళ్లుగా మోసం చేసిన చంద్రబాబు ఈ రోజు ధనకర్ణుడిలా కలరింగ్‌ ఇస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల పోరాటం స్పూర్తిదాయకమన్నారు. తలా తోక లేని ప్రశ్నలతో టీడీపీలు కాలయాపన చేస్తున్నారు. పథకాలపై 75 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆంధ్రజ్యోతిలో వార్తలు రాయించుకుంటున్నారని, అది ఆంధ్రజ్యోతి కాదు..చంద్రజ్యోతి అని ఆమె ఎద్దేవా చేశారు. మీరు చేసిన హామీలు అమలు చేయనందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. ఆడవాళ్లను కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో దించినందుకు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు సంతోషంగా ఉన్నారా? పేదవాళ్లకు ఇల్లు ఇవ్వకపోతే సంతోషంగా ఉన్నారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే నీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయించండి అన్నారు. మీ పథకాలతో సంతృప్తిగా ఉన్నారని భావిస్తే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. 11 మంది మంత్రులు బేష్‌ అని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చినందుకు బేషా?..పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ నియోజకవర్గంలో నీటి సమస్య ఉంటే లోకేష్‌ బేషా? అని రోజా ప్రశ్నించారు. విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ లోకేష్‌కు సూట్‌కేసు ఇస్తేనే ఆ ఫైల్‌పై సంతకం చేస్తారని ఆరోపించారు.

బాబు శాడిజానికి పరాకాష్ట ఆనంద అమరావతి
– ప్రజలు ప్రత్యేక హోదా ఉద్యమంలో ఉంటే వారిని డైవర్ట్‌ చేసేందుకు ఆనంద అమరావతి అంటూ చంద్రబాబు కొత్త పల్లవి ఎత్తుకున్నారన్నారు. నాలుగేళ్లలో ఒక్క పర్మినెంట్‌ భవనం కట్టలేదన్నారు. ఎమ్మెల్యే చింతమనేని తన గేదేలను కట్టేస్తానని అంటే ఆ ప్రాంతంలో ఆనంద అమరావతి కనిపిస్తుందా అన్నారు. అమరావతిని స్కాం క్యాపిటల్‌గా మార్చారని విమర్శించారు. రైతులను బెదిరించి భూములు లాక్కున్నారన్నారు. అలాంటి కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పిలవడం బాధాకరమన్నారు. తెలుగు గడ్డపై పుట్టిన వెంకయ్య ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలు పోరాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాజధానిలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ జరిగితే వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. దేవాలయ భూములు దోచుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. 40 దేవాలయాలను కూల్చారన్నారు. ప్రజలు ఎక్కడ ఆనందంగా ఉన్నారో సమాధానం చెప్పాలని రోజా పట్టుబట్టారు. వెంకయ్యకు బాలకృష్ణ ఫంక్షన్‌కు వెళ్లే తీరిక ఉందని, ప్రజల పోరాటంపై మాట్లాడేందుకు తీరక లేదా అని ప్రశ్నించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను అందరూ మెచ్చుకుంటారని, అయితే చంద్రబాబు ఎం చేశారంటే ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. ఈ రోజుకైనా ప్రజలు తెలివిగా ఆలోచించారు కాబట్టే చంద్రబాబు రోడ్డుమీదకు రావాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఏప్రిల్‌ 1 ఫూల్స్‌ డే కానీ, చంద్రబాబు ఏప్రిల్‌ 30ని ఫూల్స్‌  డేగా మార్చారన్నారు. ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే తెలంగాణ మాదిరిగా రాజకీయ సంక్షోభం సృష్టించారో అలాగే ఏపీలో కూడా అందరూ రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే సాధ్యమవుతుందన్నారు. తెలుగు దేశం నేతలను ఊర్లలోకి రాకుండా నిలదీయాలని రోజా పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే నష్టపోతామని ఆ రోజు వైయస్‌ జగన్‌ చక్కగా చెప్పారన్నారు. చంద్రబాబుకు అనుభవం ఉందని నమ్మి అధికారంలోకి తీసుకువస్తే ఆయన తన వెన్నుపోటు బుద్ధిని పోగొట్టుకోలేదన్నారు. ఢిల్లీలో టీడీపీ నేతలు నాటకాలు ఆడటం ముగిసిందని, ఈ రోజు ఏపీలో నాటకాలు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలను నీరుగార్చేందుకే ఏప్రిల్‌ 30న తిరుపతిలో టీడీపీ సదస్సు పెట్టిందన్నారు. చంద్రబాబు నిద్ర లేచి వెన్నుపోటు రాజకీయాలతో కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అసమర్ధ పాలన, అవినీతి చూసి టీడీపీ నేతలే విసిగిపోయారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి బయటకు వెళ్తారని నామినేటేడ్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారని విమర్శించారు. విధిలేని పరిస్థితిలో నామినేటేడ్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారని రోజా విమర్శించారు. 
 
Back to Top