సారా చంద్ర"బార్" నాయుడు

  • బాబు ఏపీని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చాడు
  • నారావారి నరకాసుర పాలనలో మహిళలకు రక్షణ కరువైంది
  • బార్ల పాలసీ క్యాబినెట్ లోని తాగుబోతుల నిర్ణయమే
  • స్కూళ్లను మూసేసి బార్ లను తెరవడమేనా బాబు నీ విజన్
  • రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు మహిళలుగా సిగ్గుపడుతున్నాం
  • వైయస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్ః చంద్రబాబు నాయుడు ఏపీని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్టీఆర్ మద్యనిషేధాన్ని తీసుకొస్తే....చంద్రబాబు దానికి తూట్లు పొడుస్తూ తాగండి, చచ్చేవరకు తాగించండి అంటూ విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే దానికన్నా సారా చంద్రబార్ నాయుడు అని పేరు మార్చుకుంటే బాగుంటుందని రోజా నిప్పులు చెరిగారు. నారా వారి నరకాసుర పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా చంద్రబాబు మద్యం విధానాలపై విరుచుకుపడ్డారు. స్కూళ్లను మూసేసి బార్ లను తెరవడమేనా బాబూ నీ విజన్ అంటూ రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

మహిళా దినోత్సవాలు, మహిళా పార్లమెంటేరియన్ సదస్సులలో  మహిళా సాధికారతే ముఖ్యమని సుదీర్ఘ ఉపన్యాసాలిచ్చే ముఖ్యమంత్రి, ఆయన సభ్యులు మహిళల భద్రత కోసం చేసింది శూన్యమని రోజా తూర్పారబట్టారు.  వీళ్ల  ధనదాహానికి, వీరి మద్యం విధానాల వల్ల మహిళల జీవితాలు బలవుతున్నా, విద్యార్థులపై వేధింపులు పెరుగుతున్నా ఎక్కడా వీటిని నివారించే ప్రయత్నం జరగడం లేదన్నారు. మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు  సాధారణ మహిళకు ఏవిధంగా రక్షణ కల్పిస్తారని రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను ఎవరైనా వేధిస్తే 5 నిమిషాల్లో వచ్చి తాట తీస్తామని చెప్పారే, ఏరోజైనా ఆ పనిచేశావా బాబూ ..?  కోడలు మగపిల్లాడినికంటానంటే అత్త వద్దంటుందా అని ఆడదాని పుట్టుకనే అవమానించే పరిస్థితికి చంద్రబాబు వచ్చాడంటే.... ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఏపీలోని మహిళలంతా  సిగ్గుపడుతున్నామన్నారు. 

రూ.2లకే 20 నీటిర్ల మంచినీటిని ఇస్తామన్నారు.  తాగేనీళ్లు ఇచ్చేందుకు చిత్తశుద్ధి లేదు గానీ....ఇంటింటికీ మద్యం అందించేదానికి మాత్రం దిగజారి జీవోలు విడుదల చేస్తున్నారని ప్రభుత్వంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రతి ఏడాదికోసారి బార్ లైసెన్సులు రెన్యువల్ చేసేవారని, 50 వేల మందికో బార్ ఉండేదన్నారు. ప్రస్తుతం 30వేల మందికో బార్ అంటూ కొత్తగా 85 బార్లకు లైసెన్స్ లిచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. క్యాబినెట్ లో ఉన్న తాగుబోతులంతా తీసుకున్న బార్ల పాలసీ అని అర్థమవుతోందని రోజా ఎద్దేవా చేశారు. మరో ఏడాదో, రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని,  ఏ అర్హతతో ఐదేళ్లు లైసెన్స్  ఇవ్వడానికి మీరు పూనుకున్నారని రోజా బాబును నిలదీశారు. మద్యం లైసెన్సులు తీసుకున్న వ్యాపారస్తుల దగ్గర ఎన్ని వందలకోట్లు వసూలు చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. దాంట్లో  బాబు, లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి వాటా ఎంతో బహిర్గతం చేయాలన్నారు. 30వేల మందికో అంబులెన్స్, ఆస్పత్రి, మంచినీటి పథకం పెట్టడం చేతగాదు గానీ....బార్ లను పెట్టేందుకు మాత్రం జీవో విడుదల చేశారంటే మీకన్నా సిగ్గుమాలిన ముఖ్యమంత్రి మరెవరైనా ఉన్నారా బాబు అని రోజు దుయ్యబట్టారు. 

మనసున్న ముఖ్యమంత్రి ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అది వైయస్ఆర్ పాలనలోనే చూశామన్నారు. బాబు ప్రజలను పీల్చిపిప్పి చేయడం  తప్ప వారికి చేసిందేమీ లేదని అన్నారు. వైయస్ఆర్ ఏదైనా సంతకం చేస్తే ఆ క్షణం నుంచి అది అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక పచ్చతమ్ముళ్ల బెల్ట్ షాపులకు పర్మిషన్ లు ఇస్తూ ప్రజల రక్తాన్ని పీల్చిపిప్పి చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లను మూసేసి పేద ప్రజల పిల్లలను చదివించే అర్హత లేకుండా చేస్తున్నారు. ప్రతి ఇంటికి మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి మహిళలకు కడుపుకోత మిగిలిస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేస్తునన్నారు. భర్తలను పోగొట్టుకున్న భార్యలు..కొడుకులను పోగొట్టుకున్న తల్లుల ఆర్తనాదాలు కనిపించడం లేదా బాబు అని రోజా ప్రశ్నించారు.  ఆర్తన పుస్తెలు తెంచుతున్నారని  పుస్తెలు తెంచుకని బార్య, కొడుకులు పోయి తల్లులు ఏడుస్తున్నది పట్టదా..? వాళ్ల విధవలవుతున్నారు. నీవు పాదయాత్ర చేసినప్పుడేమో ప్రజలు గుర్తుకొస్తారు...అధికారానికొచ్చేసరికి  లోకేష్, దేవాన్షులు కనిపించారా..? అని బాబుపై మండిపడ్డారు. 

నెల నెల మామూళ్లు వసూలు చేయడం  నావల్ల కాదని ఓ ఎస్సై కలెక్టర్ కు లెటర్ రాస్తున్నాడంటే రాష్ట్రం ఎటుపోతుందని రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్కో ఎస్సైకి రూ. కోటి టార్గెట్ పెట్టి పోలీసుల్ని ఇలాంటి దుర్మార్గాలకు ఉపయోగించుకుంటారా అని రోజా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2539 ఎస్సైలు..నెల వసూళ్లు రూ. 30,460 కోట్లు... మీ టార్గెట్ ప్రకారం అంటే మూడేళ్లలో రూ. 91వేల కోట్లపైనే మీకిచ్చారు. పోలీసు, రెవెన్యూ, అధికార వ్యవస్థల్ని ఉపయోగించి దోపిడీ చేసే మీ వాళ్లను రాక్షసులనాలా..? ప్రజానాయకులనాలా..? కంచె చేను మేసినట్టుగా... ప్రజలు, ఆడవాళ్ల మాన ప్రాణాలను రక్షించాల్సిన ముఖ్యమంత్రే హరిస్తుంటే ఆయన ఉంటే ఎంత ఊడితే ఎంత..? ఇలాంటి ముఖ్యమంత్రినా మనం ఎన్నుకున్నదని ప్రజలు రోదిస్తున్నారని రోజా చెప్పారు. మొన్నటిదాక ప్రతిపక్షాలు, జర్నలిస్టుల, మీడియా, అధికారులను బెదిరించిన చంద్రబాబు... ఇప్పుడు ఏకంగా ఓటర్లనే బెదిరించే పరిస్థితికి వచ్చాడన్నారు. నాపెన్షన్, రేషన్ అని చంద్రబాబు మాట్లాడడాన్ని రోజా తప్పుబట్టారు.  మీ నాన్న ఖర్జూరనాయుడు సొత్తా..? మీ మామ ఎన్టీఆర్ సొత్తా...మీపుత్రుడు లోకేష్ సొత్తా..? ప్రజలు కట్టే పన్నులతో సంక్షేమ పథకాలు పెట్టి నా సొత్త అని మాట్లాడుతావా అంటూ రోజా బాబుపై ధ్వజమెత్తారు. ప్రజల సొత్తును అనుభవిస్తూ సిగ్గులేకుండా వారినే బెదిరిస్తావా అంటూ రోజా బాబుపై విమర్శలు గుప్పించారు. 

Back to Top