ఉక్కు పరిశ్రమ ఆలోచన వైయస్‌ఆర్‌దే


వైయస్‌ఆర్‌ జిల్లా: రాయలసీమను అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం, కడప ఉక్కు పరిశ్రమ స్థాపించాలని భావించారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఆలోచన మహానేత వైయస్‌ఆర్‌దే అన్నారు. రాయలసీన అభివృద్ధి చెందాలంటే సాగునీరు ఇవ్వాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండు చేశారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, రాయలసీమకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆ నాడు జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, కడప స్టీల్‌ ప్లాంట్‌కు చర్యలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు నాడు ఉక్కు పరిశ్రమను అడ్డుకున్నారని, ఇవాళ ఆ పార్టీ నేతలతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
 
Back to Top