రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం

వైయస్‌ఆర్‌ జిల్లా: రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే పరోక్ష కారణమని, ఏ పంటకూ మద్దతు ధర లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని..ఇంత వరకు ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.  రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం పరోక్షంగా కారణమవుతుందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ సకాలంలో ఇవ్వని కారణంగా రైతులు న ష్టపోతున్నారన్నారు. రుణాలు సకాలంలో మాఫీ చేయని కారణంగా అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పంటల బీమా అందని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన వారు చరిత్రహీనులవుతున్నారన్నారు.   వైయస్‌ జగన్‌ సీఎం కాగానే రైతులకు న్యాయం చేస్తామని రవీంద్రనాథ్‌రెడ్డి హామీ ఇచ్చారు. 
 
Back to Top