వైయస్ఆర్ జిల్లా : సాగు నీటి కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈ నెల 30 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సర్వరాయసాగర్ ప్రాజెక్టు నుంచి కడప కలెక్టరేట్ వరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో మూడు రోజుల పాటు రవీంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర అనంతరం 2 వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.<br/><br/>