వైయస్‌ జగన్‌ ఆదేశాలిస్తే రాజీనామాలకు సిద్ధం

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిస్తే ఎమ్మెల్యేలమంతా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు. మంచి ఆశయం కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు శాసనసభ్యుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా నియంతలా పరిపాలన చేస్తున్నాడని మండిపడ్డారు. పెన్షన్‌ ఇచ్చేందుకు, రోడ్లు వేయించేందుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, అధికారుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పెత్తనం మొత్తం వారికి అంటగాట్టారన్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వంలో పెద్దపీట వేసి వ్యవస్థలను చంద్రబాబు దుర్వనియోగం చేశాడని దుయ్యబట్టారు. ఇంత నీచంగా పరిపాలన చేసే ముఖ్యమంత్రిని మొదటి సారి చూస్తానన్నారు. 
 
Back to Top