ప్రత్యేక హోదా పోరాటయోధుడు వైయస్‌ జగన్‌


కృష్ణా: ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. విజయవాడలో ఒక్కరోజు దీక్షకు రూ. 30 కోట్ల ప్రజాధనాన్ని టీడీపీ ఖర్చు చేసిందని, దీక్షలకు విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులను తీసుకొచ్చారు తప్ప ఎవరూ స్వచ్ఛందంగా రాలేదన్నారు. హోదాతో చిత్తశుద్ధితో పోరాడే వ్యక్తి వైయస్‌ జగన్‌ అని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. ఈ నెల 30వ తేదీన చంద్రబాబు చేసిన మోసానికి విశాఖలో వైయస్‌ఆర్‌ సీపీ వంచన దీక్ష చేపడుతుందన్నారు. దీక్షలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 
 
Back to Top