చంద్రబాబు కొంగ జపం, దొంగదీక్షలు మభ్యపెట్టేందుకే

విశాఖపట్నం: ప్రజలను మభ్యపెట్టడం కోసం చంద్రబాబు కొంగ జపాలు, దొంగ దీక్షలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాజన్నదొర ధ్వజమెత్తారు. మండుటెండలో ప్రజల సమస్యలను తీర్చడం కోసం.. రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు పార్టీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారన్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక ఎన్నో అడ్డుంకులు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ కుమ్మకైందని చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కృషి చేస్తున్న వైయస్‌ జగన్‌కు ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు. అదే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జననేతకు అండగా ఆయన అడుగులో అడుగేసి.. ఆయన చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయంతం చేసి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని, ప్రత్యేక  హోదా సాధన కోసం తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top