విష జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే

– ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర
విజయనగరం: విష జ్వర మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర పేర్కొన్నారు. సాలూరు మండలం కరాసువలసలో విషజ్వరాలు ప్రబలి 15 రోజుల్లో 9 మంది మృత్యువాతపడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు విష జ్వరాలతో వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. 
 
Back to Top