మరోసారి మోసానికి చంద్రబాబు కుట్ర

వైయస్‌ఆర్‌ జిల్లా: ఎన్నికల వేళ నామమాత్రపు జీతాలు పెంచి అంగన్‌వాడీ, ఆశావర్కర్లను చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికి పూనుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌ బాషా, రఘురామిరెడ్డిలు అన్నారు. కడపలో వారు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, హోంగార్డులు ఆందోళన చేస్తే లాఠీచార్జ్‌ చేయించింది చంద్రబాబూ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అరకొర జీతాలు పెంచి ఓట్లు దండుకోవడానికి వారిని ఉపయోగించుకుంటున్నారన్నారు. నాలుగేళ్లుగా వారికి కడపలో ఒక్క సెంట్‌ స్థలమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. కలెక్టర్‌ ప్రోటోకాల్‌ ఉల్లంఘిస్తే అధికారులు ఎలా ఉంటారో..? కలెక్టర్, అధికారులుపై అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులపై చర్యలకు ఏపీ పీఎస్‌ను కలుస్తామని రఘురామిరెడ్డి చెప్పారు. 
Back to Top