ఉక్కు పరిశ్రమ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర

వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు పరిశ్రమ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. చిత్తశుద్ధితో పోరాటం చేసిన పరిశ్రమ తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్‌పై ఉందన్నారు. మైదుకూరులో చేపట్టిన ఉక్కు బంద్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సదుపాయాలు కల్పించిందో జవాబు ఇవ్వండి వెంటనే మంజూరు చేస్తామని సంబంధిత కేంద్రమంత్రి చెప్పారని, దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను అడ్డుకుంటుందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ఎంపీ సీఎం రమేష్‌నాయుడుతో నిరాహార దీక్ష చేపిస్తున్నారన్నారు. రమేష్‌నాయుడు తొమ్మిది రోజుల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా దీక్ష చేస్తున్నారంటే.. అది మానవులకు ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఓట్ల కోసం కొత్త కొత్త స్టంట్‌లు వేస్తున్నారన్నారు. 
Back to Top