పూర్తికాని ఇళ్లకు పూలదండలు వేస్తూ గృహప్రవేశాలు

వైయస్‌ఆర్‌ జిల్లా: పూర్తికాని ఇళ్లకు పూలదండలు కట్టి తెలుగుదేశం పార్టీ గృహప్రవేశాలు చేయిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. టీడీపీ చేస్తున్న గృహప్రవేశాల సందర్భంగా తన నియోజకవర్గంలోని ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 2,320 ఇళ్లు మంజూరు చేస్తే దాంట్లో 534 మాత్రమే పూర్తి చేసినట్లు నివేదికలు ఇచ్చారని, తీరా చూస్తే 9 ఇళ్లకే గృహప్రవేశాలు చేశారన్నారు. లక్షల ఇళ్లు అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు జిమ్మిక్కులు ఈ విధంగా ఉంటాయన్నారు. 
 
Back to Top