ఎంపీల రాజీనామాలతో గర్వపడుతున్నాం


వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజల కోసం, ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమ స్ఫూర్తితో ఆమోదించుకోవడాన్ని గర్వపడుతున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులో నిరసన దీక్ష చేపట్టిన ఆయన ఎంపీల రాజీనామాలపై స్పందించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా మా పార్టీ ఎంపీలు ప్రజల కోసం ప్రత్యేక హోదా సాధనకు రాజీనామా చేశారన్నారు. ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేశారన్నారు. నిజంగా గర్వపడుతున్నామని శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతల మాదిరిగా పదవుల కోసం పాకులాడటం లేదని, త్రుణప్రాయంగా పదవులు త్యాజించామని చెప్పారు. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది చంద్రబాబు, లోకేష్‌ తీరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కావాలంటారు.వద్దంటారు. ప్యాకేజీ అంటారు..అన్ని రకాలుగా లబ్ధి పొంది చిట్ట చివరిగా మళ్లీ అధికారం కోసం వైయస్‌ఆర్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీకి కాదు చంద్రబాబు పోటీ పెట్టేది..ప్రత్యేక హోదా నినాదానికి టీడీపీ పోటీ పడుతుందన్నారు. టీడీపీకి చిత్తశుద్ది ఉంటే  రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. 
 
Back to Top