ఐదో రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష


వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ప్రొద్దుటూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. అన్నా క్యాంటీన్‌ కోసం పాతబస్టాండ్‌లో షాపులను తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు సమాయత్తం కావడంతో ఎమ్మెల్యే రాచమల్లు ఆందోళన చేపట్టారు. అన్నా క్యాంటీన్‌ కోసం పేదల పొట్ట కొట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డుపై పడేయాలనుకోవడం సమంజసం కాదని హెచ్చరించారు. 
 
Back to Top