ఉక్కు పరిశ్రమ స్థాపించి తీరాల్సిందే



వైయస్‌ఆర్‌: విభజన చట్టంలోని హామీ అయిన కడప ఉక్కు పరిశ్రమను జిల్లాలో ఏర్పాటు చేయాల్సిందే అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండు చేశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మంగళవారం ప్రొద్దుటూరులో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం జిల్లాలకు తీవ్ర అన్యాయం చేస్తే..నాలుగేళ్లుగా చంద్రబాబు మోదీని నిలదీయకుండా మోసం చేశారన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ చేసే దీక్షలో నిజాయితీ, విశ్వసనీయత లేదని విమర్శించారు. చంద్రబాబుకు మొదటి నుంచి ఈ జిల్లాపై ఈర్ష ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి  వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఈ జిల్లా వాసులు ప్రేమిస్తున్నారని చంద్రబాబు కక్షగట్టారన్నారు. సీఎం రమేష్‌ దీక్ష తుక్కు దీక్ష అవుతుందన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆ రోజే ప్రారంభోత్సవం చేశారన్నారు. అన్నీ ఈ జిల్లాలో ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు స్థాపించడం లేదని ప్రశ్నించారు. ఆ రోజు బ్రాహ్మణి ప్రాజెక్టును అడ్డుకున్నది చంద్రబాబు కాదా అని నిలదీశారు. బ్రాహ్మిణి స్టీల్‌ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు రద్దు చేసిందన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నాయిబ్రాహ్మణులతో పెట్టుకున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. 
 
Back to Top