ఉక్కు పరిశ్రమ ఎందుకు స్థాపించరు?


వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు పరిశ్రమ స్థాపనకు ఖనిజాలు, నీరు, భూములు అన్నీ అనువుగా ఉన్నా ఎందుకు స్థాపించడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కడప ఉక్కు పరిశ్రమ సాధనకు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఈ జిల్లా వాసులు ప్రేమిస్తున్నారని బీజేపీ, టీడీపీ నాయకులు జిల్లాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తామని, రైల్వే జోన్, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇరు పార్టీలు ఓట్లు వేయించుకొని, అధికారాన్ని అనుభవిస్తూ నాలుగేళ్లుగా ఉక్కు పరిశ్రమ స్థాపించకపోవడం దారుణమన్నారు. టీడీపీ ఈ నాలుగేళ్లు నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ప్రజా సేవ కోసమే పరిశ్రమలు స్థాపించాలి తప్ప..ప్రభుత్వ ఆదాయం కోసం స్థాపించకూడదన్నారు. ఈ జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేసి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించేవారన్నారు. నాలుగేళ్లు తరువాత ఇప్పుడు టీడీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం దారుణమన్నారు. రాజకీయాల కంటే ప్రజాసేవే వైయస్‌ఆర్‌సీపీకి ముఖ్యమని రాచమల్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఆరు నెలల్లో వస్తాయని ఇప్పుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 
 
Back to Top