టీడీపీకి కాంగ్రెస్‌ గతే పడుతుంది

ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే.. టీడీజేపీ, బీజేపీలకు పడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారన్నారు. ఢిల్లీలో ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ నిజాయితీతో హోదా ఉద్యమం చేస్తుంది కాబట్టే ప్రజలు, జాతీయ పార్టీ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారన్నారు. నేడు జాతీయ రహదారుల నిర్భందం, రేపు రైలురోకో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేసే దుస్థితి నెలకొందన్నారు. 
Back to Top