నాయకులు సైనికుల్లా పనిచేయాలి

  
 
  విజ‌య‌న‌గ‌రం :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి పార్టీ నాయకులు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. మన్య ప్రాంతంలో ఉన్న పలు సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఎత్తిచూపాలని అన్నారు.  కార్య‌క్ర‌మంలో  అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకులోయ సమన్వయకర్త చెట్టి పాల్గుణ, అరకులోయ, హుకుంపేట మండల పార్టీ అధ్యక్షులు కొర్రా గాశీ, గెమ్మెల కొండబాబు, జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, డుంబ్రిగుడ మాజీ ఎంపీపీ సాయిబాబ, ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి డి. ఆనంద్‌ కుమార్, జిల్లా ఎస్టీ సెల్‌ కార్యదర్శి బాకూరి సదాశివరాజు, అరకు పార్లమెంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సీవేరి కొండలరావు, వైస్‌ ఎంపీపీ ధర్మనాయుడు, అరకు మండల  ప్రధాన కార్యదర్శులు రమేష్, గెన్ను, డుంబ్రిగుడ మండల కార్యదర్శి విజయదస్మి, మహిళ నాయకురాలు కోడ సుçహాసిని తదితరులు పాల్గొన్నారు. 


Back to Top