వైయస్‌ జగన్‌ నవ చరిత్ర


–  జనం కోసం జగన్‌..జగన్‌ కోసం జనం
–   ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
విజయనగరం: రాష్ట్ర ప్రజలంతా వైయస్‌ జగన్‌ కోసం వేచి చూస్తుంటే.. జనం కోసం వైయస్‌ జగన్‌ వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. జనం కోసమే వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారని, జననేత కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. జగన్‌ కోసం జనం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు.  ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం ద్వారా ఒక చరిత్ర సృష్టిస్తే..వైయస్‌ జగన్‌ నవచరిత్ర సృష్టించారని చెప్పారు. చరిత్ర సృష్టించాలన్నా..తిరగ రాయాలన్నా మహానేత వంశానికే చెందుతుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి విజయనగరం జిల్లా నుంచి విజయం నాంది పలుకబోతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఇక్కడి నుంచే చరమ గీతం పాడబోతున్నారని చెప్పారు. 
 
Back to Top