సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే అడ్డుకుంటారా?

కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు
నెల్లూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బయల్దేరిన ఎమ్మెల్యేని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గంలోని ఆల్లూరు మండలం చంద్రబాబునగర్‌ పర్యటనకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాత్సాహం ప్రదర్శించి ఎమ్మెల్యేను బలవంతంగా అరెస్టు చేశారు. ప్రజలను కలవనివ్వకుండా చేయడం ఏంటని ఎమ్మెల్యే పోలీసులను ప్రశ్నించడంతో శాంతిభద్రతల సమస్య అంటూ కుంటిసాకులు చెబుతూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. 
 
Back to Top