పేదల స్థలాలు లాక్కోవడం ఏంటీ?

కృష్ణా: పేదలకు ఇచ్చిన స్థలాలను ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు మండిపడ్డారు. నూజివీడు ఎం.ఆర్‌ అప్పారావు కాలనీలో పేదలకు పట్టాలకు ఇచ్చిన స్థలంలో భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. దీంతో రెవెన్యూ ఉద్యోగులు గుడిసెలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్టే ఉన్నా గుడిసెలను ఎందుకు తొలగిస్తున్నారని పశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నూజివీడు–తిరువూరు జాతీయ రహదారిపై బైటాయించి ధర్నా చేపట్టారు. 
 
Back to Top