ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి బాబూ?

విజయవాడ:  ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. ఫిరాయింపు వ్యవహారంపై ప్రజలు, న్యాయస్థానం ఆగ్రహంతో ఉందని, ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సూచించారు. రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేయడం పట్ల వారు స్పందించారు. చంద్రబాబు నాలుగేళ్లుగా తప్పుమీద తప్పు చేస్తూ తనకున్న అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వ తీరు చూసి కోర్టులు కూడా విసుగు చెంది నోటీసులు ఇచ్చారని చెప్పారు. 
  
 

తాజా ఫోటోలు

Back to Top