అక్ర‌మ మైనింగ్ కేసు సీబీఐకి అప్ప‌గించాలి

గుంటూరు:  గుర‌జాల అక్ర‌మ మైనింగ్ కేసు సీబీఐకి అప్ప‌గించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి డిమాండు చేశారు. గుర‌జాలలో అక్ర‌మ మైనింగ్‌ను ప‌రిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న   పార్టీ నాయ‌కుల‌నుపోలీసులు అడ్డుకోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. టీడీపీ నాయ‌కులు న‌డిరోడ్డుపై మీటింగ్ పెట్టుకుంటే అనుమ‌తించిన పోలీసులు..మేం చ‌ట్ట‌ప్ర‌కారం అనుమ‌తి కోరినా నిరాక‌రించార‌ని మండిప‌డ్డారు.  గుంటూరు జిల్లా అంతా పోలీస్‌ నిర్భందంలో ఉందని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. అక్రమ మైనింగ్‌ వాస్తవాలను తెలుసుకునేందుకు గురజాల వెళ్తుంటే ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు.జిల్లాలో 28 ల‌క్ష‌ల ట‌న్నుల తెల్ల‌రాయిని టీడీపీ నేత‌లు దోచుకున్నార‌ని ఆరోపించారు.  
Back to Top