కుట్ర రాజకీయాలకు బాబే నాయకుడు

కృష్ణా జిల్లా:  కుట్ర రాజకీయాలకు చంద్రబాబే నాయకుడని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించేందుకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పథకం ప్రకారం వైయస్‌ జగన్‌ను జైలుకు పంపారని విమర్శించారు. తనపై కేసుల విషయంలో చంద్రబాబు కాంగ్రెస్‌ నేతల కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌ను అన్యాయంగా జైలులో పెట్టడానికి చంద్రబాబే కారణమన్నారు. దానికి నిదర్శనం రాహుల్‌ను చంద్రబాబు అభినందించడమే అన్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు కాపాడారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ మా శత్రువని చెప్పిన బాబు నిన్న కర్ణాటకలో చేసిందేంటని ప్రశ్నించారు. చంద్రబాబు నయవంచకుడని ఆ నాడు ఎన్‌టీ రామారావు పేర్కొన్నారని చెప్పారు.
 
Back to Top