వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రార్ధించా

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీవారిని వేడుకున్నారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రావాలని, ప్రజల కోసం అనునిత్యం పోరాడే జననేత ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. 
Back to Top