ఎన్నిక‌ల‌కు వెళ్దామా బాబూ?

చిత్తూరు:

నంద్యాలలో నిజంగా టీడీపీది గెలుపే అయితే, ఫిరాయించిన 20 మంది వైయ‌స్ఆ ర్‌సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని.. ఆ ఫలితాలను రెఫరెండంగా స్వీకరిద్దామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చంద్ర‌బాబుకు స‌వాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా చంద్రబాబు జలహారతి పేరుతో వారి దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌.రాజశేఖరరెడ్డి ఉచిత కరెంటు హామీ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాలన్నారని, ఇప్పుడెందుకు ఆయన రైతుల జపం చేస్తున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మూడున్నరేళ్ల పాలనలో రైతులకు మేలుచేసే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయకపోగా, తనకు లాభం వచ్చే పురుషోత్తపట్నం, పట్టిసీమ వాటిపై దృష్టి పెట్టారని విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top