ఊపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే ఉంటా


విశాఖ: నాలో ఊపిరి ఉన్నంత వరకు వైయస్‌ జగన్‌ వెంటే ఉంటానని ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. కే. కోటపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బహింరగ సభలో ఆయన మాట్లాడారు. మన బతుకులు మార్చడానికి నిరంతర శ్రామికుడు, పోరాట యోధుడు, రాజన్న ముద్దుబిడ్డ వైయస్‌ జగన్‌ మన కోసం వచ్చాడన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పేద ప్రజల గురించి ఏం చేయబోతున్నారో నవరత్నాల ద్వారా వెల్లడించారన్నారు. ప్రతి పల్లెలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్టపరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులకు అధికారం కట్టబెట్టి దోచుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ప్రభుత్వం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైవాడ నీరు పూర్తి స్థాయిలో రైతులకు అందజేస్తామన్నారు. కోటపాడులోని కమ్యూనిటీ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చుతామన్నారు. అర్ధరాత్రి అయినా పేదవారికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచభూతాల సాక్షిగా శాసనసభ ఉప నేతగా నన్ను జగనన్న ఎన్నుకున్నారని, నా ఊపిరి ఉన్నంత వరకు ప్రలోభాలకు, ఒత్తిడికి లొంగకుండా, జగన్‌ అన్న వెంటే ఉంటానని స్పష్టం చేశారు. దేనికి లొంగనని, జగన్‌ అన్న నా ఊపిరి, ప్రాణమన్నారు. 
 
Back to Top