స్వార్థానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు

వైయస్‌ఆర్‌ జిల్లా: తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైల్వేకోడూరు నియోజకవర్గం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొరుముట్ల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబుకు మతిభ్రమించడం వల్లే రాయలసీమకు ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమల సాధన కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. 
Back to Top