ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరు ఆగదు

వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరు ఆగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి సమస్యపై ప్రజల పక్షాన పోరాడుతున్నామన్నారు. ఉక్కు పరిశ్రమ రాయలసీమ హక్కు అని వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన బంద్‌కు ప్రజా సంఘాలు, వామపక్షాలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలిపాయన్నారు. ఉక్కు పరిశ్రమ కడపలో స్థాపించడం కుదరదని 2014లో కమిటీ రిపోర్టు ఇస్తే దానిపై పోరాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీతో అంటకాగి ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు దొంగ దీక్షలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమ వస్తే ప్రత్యక్షంగా.. పరోక్షంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. 
Back to Top