దేశంలోనే అధిక ప్రజాదరణ ఉన్న నేత వైయస్‌ జగన్‌

విశాఖ జిల్లాలో వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. దేశంలోనే ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌ 6వ తేదీ ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి విఫరీతమైన స్పందన వస్తోందని, విశాఖ జిల్లాలో ఊహించిన దానికంటే అధికంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు జననేతకు చెప్పుకుంటున్నానరి చెప్పారు. జగన్‌ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
 
Back to Top