వైయస్‌ జగన్‌ పాదయాత్ర టీడీపీకి దడ పుట్టిస్తోందితూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో టీడీపీ నేతలకు దడ పుడుతోందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. 200వ రోజు ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో వైయస్‌ జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ..దేశంలోనే వైయస్‌ జగన్‌ అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఢృడ సంకల్పంతో జననేత ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజల ఆశీస్సులు వైయస్‌ జగన్‌కు పుష్కలంగా ఉన్నాయన్నారు. పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు. రాయలసీమ కంటే ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడంతల ఎక్కువగా ప్రజాదరణ వచ్చిందన్నారు. శ్రీకాకుళం చేరే సరికి ప్రభంజనంగా మారుతుందన్నారు. 
 
Back to Top