తిన్నది అరగక టీడీపీ దొంగ దీక్షలు– నాలుగేళ్లుగా ఇసుక, మట్టి అంతా తినేశారు
– టీడీపీ నేతలకు తెలిసిందంతా వెన్నుపోట్లు, బ్లాక్‌ మెయిల్‌ 
– ఆదినారాయణరెడ్డికి కడప గురించి మాట్లాడే అర్హత లేదు
– దేవినేని ఉమా..నోరు అదుపులో పెట్టుకో..
– వైయస్‌ఆర్‌ కుటుంబంపై బురద చల్లితే సహించేది లేదు
– వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలకు కడుపు మంట
హైదరాబాద్‌: నాలుగేళ్ల పాటు తిన్నది అరగక టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ను అడ్డుకున్న నాయకులు, నాలుగేళ్లు మోడీని ప్రశ్నించలేని వారు ఇవాళ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కొరముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చొరవతోనే రాయలసీమ అభివృద్ధి చెందిందని చెప్పారు. ఇవాళ ఇసుక, మట్టిని అక్రమంగా తిని, అది అరిగేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్రపై టీడీపీ నేతల వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇవాళ వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మండి టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కడప గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకొని..కడప గడ్డపై దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, ఎదురుదాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కడప ఉక్కు, విశాఖకు రైల్వే జోన్, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది ఒక్క వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే అన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. ఈ నాలుగేళ్లు బీజేపీతో టీడీపీ నాయకులు చెట్టాపట్టాలేసుకొని తిరిగి, ఇవాళ మాట్లాడిడే ఎక్కడ బీజేపీ నేతలు జైల్‌లో పెడతారని భయపడుతున్నారన్నారు. రాయలసీమకు మంచి చేయాలన్న ఆలోచన, ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలన్న మంచి బుద్ధి టీడీపీకి లేదన్నారు. కమీషన్ల కోసమే అధికార పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారన్నారు. సంప్రదాయాలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టీడీపీ నేలు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న ప్రత్యేక ప్రణాళికతో వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు.  వైయస్‌ జగన్‌కు ఉన్న ఆదరణ మరెవ్వరికి లేదన్నారు. కేసుల భయంతో రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. 
 
Back to Top