లోకేష్‌ విమర్శలు అర్ధరహితం


ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
హైదరాబాద్‌: నియోజకవర్గ నిధులపై మంత్రి లోకేష్‌ విమర్శలు అర్ధరహితమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అందరు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. మూడు నెలల క్రితమే 36 మంది ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. లోకేష్‌కు ట్విట్టర్‌ నాయుడు అని పేరుందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చి ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు.
 
Back to Top