ఇంకెన్నాళ్లు ప్ర‌జ‌ల‌ను వంచిస్తారు బాబూ?


- చంద్ర‌బాబు త‌న స్వార్థ రాజకీయాలతో ప్రజాప్రయోజనాలకు గండి..
-  ఈ నాలుగేళ్లలో ఏం సాధించావ్‌ చంద్రబాబు..!
- పొత్తుల‌పై చంద్ర‌బాబు దిగ‌జారుడు వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్‌:  వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాఅ  కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు ఫణంగా పెట్టారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. ఒక‌సారి ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌ని, మ‌రోసారి కావాల‌ని,  ఇలా ఎన్నిసార్లు ప్ర‌జ‌ల‌ను వంచిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదాపై మ‌రోమారు అసెంబ్లీలో తీర్మానం చేయ‌డంపై కోన ర‌ఘుప‌తి స్పందించారు. గురువారం  హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర్ర పజల్ని, నిరుద్యోగుల ఆశల్ని నీరుగార్చిందన్నారు. ఎన్నో సందర్భాల్లో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదాపై మాట్లాడి ప్రజల గొంతు వినిపించారని, చంద్రబాబు ప్రత్యేకహోదాతో పనిలేదని ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా? అని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.  బ్రహ్మండమైన ప్యాకేజీ సాధించామని.  ఏ రాష్ట్రం కూడా కేంద్రం నుంచి  సాధించలేదు. ఇదో అద్భుతమని చంద్రబాబు చెప్పి ప్రజలను మోసగించారన్నారు. ఢిల్లీకి వెళ్ళి శాలువా గప్పి తిరుపతి లడ్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపి వచ్చారన్నారు.  ప్యాకేజీ ఏమయిందని అడిగితే సమాధానాలు చెప్పకుండా ఒక సంవత్సరం పాటు కాలయాపన చేసి ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని గ్ర‌హించి చంద్ర‌బాబు యూటర్న్‌  తీసుకుని ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరం అని మాట మార్చార‌న్నారు.  తిరిగి నాలుగోసారి ప్రత్యేకహోదాపై తీర్మానం పెట్టి రాష్ట్ర ప్రజలను మరో సారి మోసం చేయడానికి చంద్రబాబు తెర లేపార‌ని  దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా రాకుండా చేసిన  నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాకుండా చేసి ప్రత్యేకహోదాను ఫణంగా పెట్టింది నువ్వు కాదా అంటూ చంద్ర‌బాబును నిల‌దీశారు.  నిరుద్యోగులను మంచి భవిష్యత్‌ను పొగొట్టి, ప్రత్యేకహోదా ద్వారా రావాల్సిన ఆదాయాన్ని చంద్రబాబు గండికొట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాల విలువైన కాలాన్ని వ్యక్తిగత, స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ఫణంగా పెట్టి రాష్ట్ర్ర ప్రజలతో ఆటలాడుకుంటున్నావని దుయ్యబట్టారు.  నేడు కేంద్రాన్ని వ్యతిరేకించిన మాత్రానా..తప్పులు చెరిగిపోవన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అమలులో ఉందా లేదా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.  అసెంబ్లీలో తీర్మానాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. సీపీఎస్‌ విధానం మీద కమిటీ అంటావ్,  నిరుద్యోగ భృతి మీద కమిటీ అంటావ్‌... ఫీజు రియింబర్స్‌మెంట్‌  పెంచడానికి అధ్యయనం చేస్తానంటావ్‌. ఎన్నిసార్లు ప్రజలను వంచనకు గురిచేస్తావని  విమర్శించారు. .శాసనసభలో ప్రతిపక్షం లేకుండా  స‌మావేశాలు నిర్వ‌హించి రాజ్యంగ విలువకు పాతరేశారన్నారు. పొత్తులు వింత చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీకి విరుద్ధంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ  ఆ పార్టీతో కలవడం సిగ్గుచేట్టన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి బీజేపీనే కారణమని చెప్పడం  చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రజలు అందరూ చంద్రబాబు నాయుడు అబద్ధాలను గమనించాలని చంద్రబాబు మాటలన నమ్మొద్దన్నారు. 
 
Back to Top