‘బాబు బ్రాహ్మణ వ్యతిరే​కి’

 
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ వ్యతిరేకని, కనీసం ఒక్క అభ్యర్థికి కూడా ఎ‍మ్మెల్యే సీటు ఇవ్వలేకపోయారని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమ‌ర్శించారు. ఆయ‌న చేసింది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువని ఎద్దేవా చేశారు. బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో నాలుగు శాతం మేర బ్రాహ్మణులు ఉన్నారని, రూ.1.45 లక్షల కోట్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి రావాల్సి ఉందన్నారు. ఇదంతా ఐవైఆర్‌ కృష్ణారావు చెప్పడం వల్లనే ఆయన తొలగించారని ఆరోపించారు. టీటీడీపై రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. వెంకన్నభక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 


Back to Top